ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 10, 2020 , 12:06:57

ప్ర‌కాశం జిల్లాలో అలుగు ల‌భ్యం.. వీడియో

ప్ర‌కాశం జిల్లాలో అలుగు ల‌భ్యం.. వీడియో

అమ‌రావ‌తి: ప‌ంగోలిన్‌. దీన్ని తెలుగులో అలుగు అంటారు. ఇది చూడ‌టానికి ముంగీస‌లా క‌నిపిస్తుంది. కానీ త‌ల‌భాగం నుంచి తోక వ‌ర‌కు పొలుసుల‌తో నిండి ఉంటుంది. ఈ పొలుసులు ఎంత గ‌ట్టిగా ఉంటాయంటే.. అది ద‌గ్గ‌ర‌కు ముడుచుకున్న‌ప్పుడు తుపాకీతో కాల్చినా బుల్లెట్ దిగ‌నంత గ‌ట్టిగా ఉంటాయ‌ట‌. అయితే, అలుగుల ప్రాణ ర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే పొలుసులే ఇప్పుడు వాటి పాలిట శాపంగా మారాయి. క్యాన్స‌ర్ ఔష‌ధాల త‌యారీలో అలుగు పొలుసుల‌ను వినియోగిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో వాటిపై స్మ‌గ్ల‌ర్ల దృష్టి ప‌డింది. దాంతో జోరుగా అలుగుల స్మ‌గ్లింగ్ జ‌రుగుతున్న‌ది. 

అందుకే అలుగుల‌ను చంప‌కూడ‌ద‌ని ప్ర‌పంచ దేశాల మ‌ధ్య ఒప్పందం జ‌రిగింది. అయినా వాటి స్మ‌గ్లింగ్ మాత్రం కొన‌సాగుతూనే ఉంది. ఏటా సుమారు 10 వేల అలుగుల‌ను స్మగ్లింగ్ చేస్తున్నార‌ని, దాదాపు 57 వేల అలుగుల‌ను చంపుతున్నార‌ని ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు స‌ర్వేల్లో తేలింది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా బెస్త‌వారిపేట గ్రామంలో సోమ‌వారం ఉద‌యం స్థానికుల‌కు అలుగు ల‌భ్య‌మైంది. అనంత‌రం స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు బెస్త‌వారిపేట‌కు చేరుకున్న అట‌వీ అధికారులు అలుగును ర‌క్షించి తీసుకెళ్లారు.          

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo