అమరావతి : ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషాల్లో ఇవాళ విడుదలైన ‘ ఆర్ఆర్ఆర్’ సినిమా చూస్తూ ఓ అభిమాని మృతి చెందాడు. ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్వీ థియేటర్లో ఓ అభిమాని కుటుంబ సమే తంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వీక్షించేందుకు వచ్చాడు. సినిమా మొదలు కాగానే తన వద్ద ఉన్న సెల్ఫోన్లో సినిమాను రికార్డు చేస్తున్న ఓబులేశు(35) ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఆస్పత్రికి వచ్చేలోగానే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అయితే అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
కాగా విశాఖ జిల్లాలో ఓ థియేటర్ వద్ద అభిమానులు వెయ్యి కొబ్బరికాయలు కొటి అభిమానాన్ని చాటు కోగా మరికొందరు మూకుమ్మడిగా సినిమాలోని సినిమా హీరోల గెటప్లను ధరించి ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో అభిమాన హీరోల కటౌట్లకు పాలాభిషేకం చేశారు.