గురువారం 13 ఆగస్టు 2020
Andhrapradesh-news - Aug 01, 2020 , 19:31:41

ప‌ర‌కామ‌ణి విభాగంపై టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష

 ప‌ర‌కామ‌ణి విభాగంపై టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష

 తిరుమల : టిటిడి ప‌ర‌కామ‌ణి విభాగంపై అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శనివారం తిరుమ‌ల‌లోని అన్నమయ్య భవనంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పరకామణి విభాగంలో నిల్వ ఉన్న నాణేలు తరలించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అద‌న‌పు ఈవో చర్చించారు. కోవిడ్ -19 లాక్ డౌన్ వల్ల నిల్వ ఉన్న రూ.4.33 కోట్లు (4 కోట్ల 33 ల‌క్ష‌ల రూపాయలు) విలువైన నాణేలను తరలించడంపై బ్యాంకర్లతో సమీక్షించారు. కాగా, కొన్నేళ్లుగా పరకామణిలో నిల్వ ఉన్న నాణేల్లో గత సంవత్సర కాలంలో దాదాపు రూ.51.80 కోట్ల విలువైన నాణేలను టిటిడి వివిధ బ్యాంకులకు అప్పగించింది. ఈ సమావేశంలో ప‌ర‌కామ‌ణి డెప్యూటీ ఈవో వెంకటయ్య, వివిధ బ్యాంకుల మేనేజర్లు,‌ ప్రతినిధులు పాల్గొన్నారు.  logo