అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఒమిక్రాన్ (Omicron Variant) వేగంగా వ్యాప్తి చెందుతున్నది. బుధవారం ఒకే రోజు 10 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16కు పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో మూడు, అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో రెండు, గుంటూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇటీవల కువైట్, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వ్యక్తులకు ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. ఒకే రోజు పది కేసులు నమోదవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.