హాజీపూర్, పిభ్రవరి 12 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని జడ్పీ చైర్పర్సన్ భా గ్యలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో ముం దుంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అనంతరం పలు శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. జ డ్పీ సీఈవో నరేందర్, వైస్ చైర్మన్ సత్యనారాయణ, కార్యాలయ సూపరింటెండెంట్లు బాలకృష్ణ,సత్యనారాయణ,శ్రీనివాస్ పాల్గొన్నారు.