ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 3 : యువత చదువుతో పాటు తాము ఎంచుకున్న ఆటలో నైపుణ్యం పెంచుకొని సత్తాచాటాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ప్రీమియర్ లీగ్ సీజన్-1 కార్యక్రమానికి సీఐ అజయ్బాబుతో పాటు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ యువతకు క్రీడలతో భవిష్యత్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో 8 జట్లు 128 మంది క్రీడాకారులు పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ శంకర్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, నిర్వాహకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.