Wild Boar Attack | అడవి పంది దాడిలో ఒకరికి గాయాలు
Wild Boar Attack | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అడవి పంది దాడిలో ఒకరికి గాయాలయ్యాయి.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అడవి పంది దాడి ( Wild Boar Attack ) లో ఒకరికి గాయాలయ్యాయి. తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలేగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మడావి కోసేరావ్ ( Madavi Koserao ) తన వ్యవసాయ భూమిలోని పంటకు మందు పిచికారి చేయడానికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన అడవి పంది అతనిపై దాడి చేసింది. దీంతో అతడు కిందపడి లేచే ప్రయత్నంలో మరోసారి వేగంగా వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిందని బాధితుడు తెలిపారు.
గాయపడ్డ మడావి కోసేరావును స్థానికులు ప్రైవేటు ఆసుపత్రి వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న తేజాపూర్ సర్పంచి కోవా రాజేశ్వర్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క చిత్రు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, మాజీ ఎంపీటీసీ కనక హనుమంతు, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు గేడం లాలు ప్రసాద్, నాయకులు గణేష్ గాయపడిన మడావి కోసేరావ్ ను పరామర్శించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

