బేల : మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐకెపీ ఏపీఎం సుజాత ( APM Sujatha ) సూచించారు. బేల మండల కేంద్రంలోని పద్మావతి మండల సమైక్య సమావేశ మందిరంలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశం లో ఏపీఎం సుజాత మాట్లాడుతూ సెర్ప్ (SERP) ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక స్వాలంబనతో పాటు మహిళ సంఘాల సభ్యులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు.
మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి రెండు సంవత్సరాల పిల్లలు పెరిగే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఐకెపీ సీసీలు శరత్ రెడ్డి , ప్రమోద్, దేవానంద్ , లక్ష్మి, మహిళ సమైక్య అధ్యక్షురాలు మంజూష, కార్యదర్శి భీం భాయి, వీఓఏలు , మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.