ఆ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లేదు : ఎమ్మెల్యే జోగు రామన్న

ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూగార్డెన్లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణం, మావల పరిధిలోని 135 మందికి రూ.75.83 లక్షలు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు.
గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. నిరుపేదల ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగుల కోసం పెన్షన్లు,రైతుల కోసం రైతు బంధు, దళితుల కోసం దళితుల బంధు తదితర పథకాలను సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్‌తో పాటు పలువురు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

