హాజీపూర్, సెప్టెంబర్ 1 : కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే వరకూ పోరాటం సాగిస్తామని జిల్లా ఐక్య వేదిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ వ్యతిరేక ది నాన్ని పురష్కరించుకొని జిల్లా కేంద్రంలో ఐక్య ఉద్యోగుల సం ఘం ఆధ్వర్వంలో నిరసన చేపట్టి ర్యాలీ తీశారు. ఐబీ చౌరస్తాకు చేరుకొని మానవహారంగా ఏర్పడ్డారు. శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన సీపీఎస్ విధానాన్ని ర ద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని డి మాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సీపీఎస్ ఉద్యోగులు మృతి చెందారని, వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో అల్లాడిపోతున్నారని, ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు చూసీచూడనట్లు ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయవద్దని పేర్కొన్నారు. అంతకు ముందు మృతి చెందిన ఉద్యోగుల ఆత్మకుశాంతి చేకూరాలని నిమిషం పాటు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరినేని గంగాధర్, ఎస్‌టీయూటీ జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు, ప్రధా న కార్యదర్శి శంకర్ గౌడ్, టీఆర్టీఈఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ రావ్దేశ్ పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడ్య కృష్ణ, పీఆర్టీయూ టీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు బండ శాంకరి, కార్యదర్శి రాసమల్ల రవి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అసంపెల్లి రమేశ్, ప్రధాన కార్యదర్శి మోతే జయకృష్ణ, టీఎన్జీవో రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా కార్యదర్శి సునీత, ఎంపీఈవోఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి బాపురావ్, యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి వేణు, టీఎస్ జేఎఫ్‌టీ కాళేశ్వరం థర్డ్ జోన్ అధ్యక్షుడు అజాజ్, తెలంగాణ నర్సింగ్ ఆ ఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సుమిత్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, అన్ని యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ కలెక్టర్ ఎదుట ధర్నా
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 1 : పెన్షన్ ఉద్యోగులకు భిక్ష కాదని.. అది వారి హకు అని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ-ఉపాధ్యాయ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ దాసరి వేణుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన యూపీఎస్ విధానం కూడా సరైనది కాదని, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సోయం ఇందురావ్, హేమంత్ షిండే, ఊశన్న, ఏటుకూరి శ్రీనివాసరావు, అబ్దుల్ కమర్, తోడసం శ్రీనివాస్, తలండి లక్ష్మణ్, తుకారం, సదాశివ్, మిర్యాలార్ శ్రీనివాస్, నాయిని శ్రీనివాస్, అమరేందర్, సంతోష్, సునీల్, ప్రభాకర్, చంద్రయ్య, ఉపేందర్, వసీం అహ్మద్, జాదవ్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.