 
                                                            కాసిపేట : మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో వ్యవసాయ కార్యాలయంలో ఏవో చల్ల ప్రభాకర్‌కు వినతిపత్రం అందించారు.
తుపాన్ కారణంగా వరి , పత్తి పంట అధికంగా నష్టపోయిందని వివరించారు. మండల రైతాంగానికి నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్, గోనెల శ్రీలత, సీపీఐ నాయకులు జాడి పోశం, రత్నం రమేష్, దుర్గం తిరుపతి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
 
                            