మంచిర్యాలటౌన్, జూన్ 17 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఈ నెల 13న ఆరేండ్ల చిన్నారి సహస్రను హత్యాచారం చేసిన మృగాడిని కఠినంగా శిక్షించాలని మంచిర్యాల రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేర కు సోమవారం స్థానిక రాముని చెరువుకట్టపై చిన్నారి సహస్ర చిత్రపటం వద్ద పూలమాల లు వేసి నివాళులర్పించారు. సహస్ర ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాక ర్ అసోసియేషన్ అధ్యక్షుడు గజెల్లి వెంకట య్య, ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, భాసర్ రావు, బూర్ల జ్ఞాని, సలహాదారులు డాక్టర్ త్రినాథరావు, డాక్టర్ సల్మాన్ రాజ్, సత్యనారాయణమూర్తి, వీర శంకర్, సిరిపురం శ్రీనివాస్, మొగిలి, రామస్వామి, జగన్, ప్రసాద్, కార్యవర్గ సభ్యుడు సందీప్, మల్లేశ్, రమణ, సురేందర్, కమల్ సింగ్ పాల్గొన్నారు.
దహెగాం, జూన్17 : హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావుతో కలిసి సోమవారం బాలిక చిత్రపటానికి నివాళులర్పించారు. చిన్నారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ. 25 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రావి శ్రీనివాస్, చింతలమానెపల్లి ఎంపీపీ డుబ్బుల నానయ్య, దహెగాం వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, నాయకలు కంభగౌని సంతోష్‌గౌడ్, బండ కృష్ణమూర్తి పాల్గొన్నారు.