ఆసిఫాబాద్ టౌన్: రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్ నివారణ-నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ డీఎంఎచ్‌వో మనోహర్‌తో కలిసి రక్తదానం సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురిని కాపాడవచ్చని అన్నారు.కనీస బరువు 45 కేజీలు ఉండి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని వెల్లడించారు.
రక్తదానం చేయడం వల్ల 88 శాతం గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో 60 యూనిట్ల నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. స్వచ్ఛంద రక్తదాతల సేవలు అభినందనీయం కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఎచ్‌వో సుధాకర్ నాయక్, కో ఆర్డినేటర్ రమేశ్, ఐ.సీ.టీ.సీ కౌన్సిలర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.