Singareni Lorries | సింగరేణి లారీలను అడ్డుకున్న గ్రామస్థులు
Singareni Lorries | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో ఆదివారం సింగరేణి లారీల ను గ్రామస్థులు అడ్డుకున్నారు.
కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో ఆదివారం సింగరేణి లారీల ( Singareni lorries ) ను గ్రామస్థులు అడ్డుకున్నారు. సింగరేణికి చెందిన లారీలు సోమగూడెం నుంచి నేరుగా కాసిపేట ( Kasipeta ) లోని గనులకు వెళ్లాల్సి ఉండగా మద్యలో టోల్గేట్ ఉండడంతో టోల్ తప్పించుకునేందుకు మందమర్రి నుంచి నేరుగా కాసిపేట గ్రామ మధ్యలో నుంచి కాసిపేట గనులకు వెళ్తున్నారు.
దీంతో రోడ్డు మొత్తం ధ్వంసం కావడంతో లారీల రాకపోకల వల్ల దుమ్ము లేసి ఇళ్లపై పడుతూ అనారోగ్య పాలవుతున్నామని గ్రామస్థులు మండి పడుతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేయాల్సిన సింగరేణి అధికారులు, దుమ్ముతో కూడిన ఫైయాష్ను రోడ్డుపై పోయడంతో మొత్తం దుమ్ము లేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కనీసం సింగరేణి అధికారులు నీళ్లు కూడా పోయడం లేదని, ఇళ్లు, మొక్కలు అన్ని దుమ్ముతో నిండుకుంటున్నాయని మండి పడ్డారు. సమస్య పరిష్కరించే వరకు లారీల రాకపోకలు జరగనవ్వమని ఆందోళన నిర్వహించారు. దీంతో దిగివచ్చిన లారీ నిర్వాహకులు రహదారిపై దుమ్ము లేవకుండా నీరు పోశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

