ప్రాణాలు తీసిన విద్యుత్ కంచె
అడవి జంతువుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు రెండు ప్రాణాలను బలిగొన్నది. ఒకే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు (గొర్రెల కాపరి, రైతు) మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మద్దిపడగ మల్లయ్య (64) ఓ రైతు అమర్చిన విద్యుత్ కంచె తగిలి మృతిచెందాడు
- వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరు మృత్యువాత
- నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి
- పోన్కల్లో విషాదఛాయలు
మామడ, సెప్టెంబర్ 20 : అడవి జంతువుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు రెండు ప్రాణాలను బలిగొన్నది. ఒకే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు (గొర్రెల కాపరి, రైతు) మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మద్దిపడగ మల్లయ్య (64) ఓ రైతు అమర్చిన విద్యుత్ కంచె తగిలి మృతిచెందాడు. సోమవారం ఉదయం రోజూలాగే గొర్రెలను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
గొర్రెలు సాయంత్రానికి ఇంటికి వచ్చాయి. కానీ, మల్లయ్య రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం వెతుకుతుండగా, పంట చేనులో విగత జీవిగా కనిపించాడు. అదే గ్రామానికి చెందిన రైతు పారెడి చంద్రమౌళి, తన పంట రక్షణ కోసం చుట్టూ విద్యుత్ కంచెను అమర్చాడు. అది తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లయ్య భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీఐ రాంనరసింహారెడ్డి తెలిపారు.
మరో రైతు బలి..
అదే పొన్కల్ గ్రామానికి చెందిన ద్యాగల బొర్రన్న(55).. వ్యవసాయ పనుల కోసం వెళ్లి, విద్యుత్ కంచె తగిలి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రన్న పనుల కోసం పంట చేనుకు వెళ్లాడు. పనులు ముగించుకొని బర్రె కోసం గడ్డి కోస్తుండగా, సమీపంలో ఏర్పాటు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సాయంత్ర కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, విగత జీవిగా కనిపించాడు. బొర్రన్నకు భార్య, కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

