కాగజ్ నగర్ : ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తరగతులను ( Training classes ) సద్వినియోగం చేసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాధికారి యాదయ్య (DEO Yadaiah), అదనపు డైరెక్టర్ శ్రీనివాస చారి సూచించారు. కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను వారు సందర్శించి పలు సూచనలు చేశారు. మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్ధతులను అలవరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్, ఎంఈవో ప్రభాకర్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఆబిద్ అలీ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.