నాడు తండ్రి.. నేడు తల్లి
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళాలతో ఆ తంతును పూర్తి చేయాల్సి వచ్చింది.
- అనారోగ్యంతో ఇద్దరు మృతి
- అనాథలైన కూతుళ్లు
- విరాళాలతో అంత్యక్రియలు
- మందమర్రిలో హృదయవిదారక ఘటన
- ఆర్థిక స్థోమత లేక ఆగిన పెద్ద కుమార్తె పెళ్లి
- కనీసం ఇల్లులేని దీనస్థితి
- దాతలు ఆదుకోవాలని వేడుకోలు
- ఫోన్ పే : 7670932632
మందమర్రి, జూలై 26 : నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళాలతో ఆ తంతును పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన మందమర్రి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామానికి చెందిన భూనేని దూనాచారి-లక్ష్మి(40) దంపతులకు అర్చన(21), అభిలాష(17) కూతుళ్లున్నారు.
పదేళ్లక్రితం భూనేని దూనాచారి అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి తన అన్న బైర్నేని చందు ఇంట్లో, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇద్దరు కుమార్తెలు పదో తరగతితోనే చదువు ఆపేశారు. ఆపై ముగ్గురూ కలిసి కూలీ పనులు చేస్తున్నారు. 8 నెలల క్రితం పెద్ద కూతురు అర్చన వివాహం నిశ్చయమైంది. ఆర్థిక స్థోమత లేక పెండ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. ఇంతలోనే విధి వారిని పగబట్టింది. ఈ నెల 17న లక్ష్మి ఇంటి వద్ద పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు జారి పడడంతో తలకు తీవ్ర గాయమైంది.
తలలో రక్తం గడ్డ కట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కూతుళ్లకు గ్రామస్తులు, బంధువులు తోడయ్యారు. కొంతమేర విరాళాలు సేకరించి అందించడంతో లక్ష్మిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి గురువారం రాత్రి మరణించింది.
శుక్రవారం గ్రామానికి తీసుకురాగా, అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో స్థానికులు, బంధువులు విరాళాలు అందజేశారు. ఆపై చిన్న కూతురు అభిలాష.. అక్క అర్చనతో కలిసి తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది. వారిద్దరు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచి వేసింది. కనీసం ఇల్లు కూడా లేని దీనస్థితిలో ఉన్న తమను దాతలెవరైనా ఆదుకోవాలని ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు సెల్ నం. 7670932632కు ఫోన్ పే చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

