కాగజ్‌నగర్, అక్టోబర్ 19: ప్రపంచ పురోగతి లో కృత్రిమ మేధస్సు పాత్ర చాలా కీలకమైనదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి ఉదయ్ బాబు అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ పాఠశాలలో జిల్లా సైన్స్ సెంటర్ కాగజ్‌నగర్ డివిజన్లో ‘కృత్రిమ మేధస్సు సంభావ్యతలు, ఆందోళనలు’ అనే అంశంపై జిల్లాలోని ఎనిమిది, పదవ తరగతి విద్యార్థులకు సైన్స్ సెమినార్ నిర్వహించారు.
ఇన్చార్జి డీఈవో ఉదయ్‌బాబు, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ మాట్లాడుతూ కృతిమ మేధస్సుకు మానవత విలువలను నైతిక విలువలను జోడిస్తే ప్రపంచ అభివృద్ధితో కృత్తిమ మేధాపాత్రను నేటి వరకు దేనితోను పోల్చలేమని తెలిపారు. సెమినార్లో ప్రథమ బహుమతి ఎం ఐశ్వర్య జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జనకాపూర్, ద్వితీయ బహుమతి సదా ఫాతిమా ఫాతిమా కాన్వెంట్ ఉన్నత పాఠశాల కాగజ్‌నగర్, తృతీయ బహుమతి టి సాయి ప్రియ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓల్డ్ కాగజ్‌నగర్ సాధించగా వీరికి సర్టిఫికెటు,్ల జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక గణాంకాల అధికారి జాడీ దేవాజీ, విద్యాశాఖ అధికారి వాసుల ప్రభాకర్ న్యాయ నిర్ణీతలుగా సత్యనారాయణ భిక్షపతిలో పాల్గొన్నారు