నార్నూర్ : కేజీబీవీ పాఠశాలలో ( KGBV School ) విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్(Santhosh) అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆదివాసి నాయకులు సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పాఠశాల ప్రత్యేక అధికారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో తాగునీటి సమస్య ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నీటిని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోట్నాక్ సక్కు, కనక ప్రభాకర్, మెస్రం గోవింద్, సిడం బాపూరావు ఉన్నారు.