Health Tips | చలి కాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ముఖ్యంగా చిన్నారులు
Health Tips | రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. చలితో పాటు వ్యాధులు సైతం విజృంభిస్తాయి. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు తెస్తాయి. ఈ సీజన్లో ఎక్కువగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులు ఇబ్బంది పెడతాయి.
Health Tips | భైంసా/మామడ, డిసెంబర్ 10 : రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. చలితో పాటు వ్యాధులు సైతం విజృంభిస్తాయి. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు తెస్తాయి. ఈ సీజన్లో ఎక్కువగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులు ఇబ్బంది పెడతాయి. ఉదయం వాకింగ్, జాగింగ్ వెళ్లాలంటే చర్మం పొడిబారి బిగుసుగా మారే అవకాశం ఉంటుంది. కాళ్ల మడిమలు, పెదాలు పగలడం వంటి సమస్యలొస్తాయి. ముఖ్యంగా పిల్లలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వివిధ రుగ్మతలు ఉన్నవారు జాగ్రత్త లు పాటిస్తే చలికాలంలో వ్యాధుల బారిన పడ కుండా రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నా రు. చలికాంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్ప నిసరి క్రీమ్ బెస్ట్ మాయిశ్చరైజర్లను ఉపయో గించడం మంచిది. ముఖం, చేతులకు, కాళ్లకు రాసుకుంటే చర్మం మృదువుగా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వేధించే మరో సమస్య పెదాలు పగలడం, పెదాలు పగిలి రక్తం కారకుండా వ్యాజిలిన్, లిప్‌బామ్, రాసుకోవాలి.
చిన్నారులు జాగ్రత్త
చలికాంలో చిన్నారులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికోసం రక్షణ నుంచి స్వెటర్లను తొడిగించాలి. వేడినీటితో స్నానం చేయించాలి. ప్రయాణాలు తగ్గించుకోవడం మం చిది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
గుండె జబ్బులున్నవారు
చలికాలంలో గుండె జబ్బులు ఉన్నవారు గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు వాకింగ్ చేయొద్దు. చలిలో ఎక్కువగా తిరిగితే రక్తనాళాలు సంకోచించి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ ఉన్నవారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

