కాగజ్‌నగర్, మే 1: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని కేరళ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. కేరళ హైస్కూల్లో 62 మందిలో 98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేరళ స్కూల్‌కు చెందిన ఎన్ విష్ణు వర్ధన్ 572, ఐ శ్రీశాంత్ 549, జీ సమత, 548, ఎం శ్రీనిధి 546, ఆర్ అక్షిత్ 540 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. వీరిని కేరళ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.