బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండలం కేంద్రంలో జొన్నల కేంద్రాన్ని (Sorghum center ) ఏర్పాటు చేయాలని పైలెట్ ప్రజావాణి లో మండల ప్రత్యేక అధికారి మోహన్ కు రైతులు(Farmers) వినతి పత్రం అందజేశారు. మండలంలోని 33 గ్రామాల రైతులు పండించిన జొన్న పంట ను ఇచ్చోడాకు తీసుకెళ్లి మార్కెట్ యార్డులో అమ్ముకోవాలంటే రైతులకు దూరబారం తో పాటు ప్రయాణ ఖర్చులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇచ్చోడ రైతులు పంట అమ్ముకునే వరకు నిబజార్ హత్నూర్ మండల రైతులు నిరీక్షించడం అవుతుందని పేర్కొన్నారు. బజార్హత్నూర్ మండల కేంద్రంలోనే సబ్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడి రైతుల కష్టాలను గట్టెకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు రాము,రమణ, శేఖర్ గంగారెడ్డి,గంగయ్య, సాయన్న తదితరులు పాల్గొన్నారు.