మంచిర్యాల టౌన్ : మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల డిపో ఆధ్వర్యంలో వేలాల జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తున్నట్టు డిపో మేనేజర్ ఎస్ జనార్ధన్ ( RTC DM Janardhan) తెలిపారు. ఈనెల 25, 26, 27 తేదీలలో భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తాయని అన్నారు.
మహాలక్ష్మి పథకం లబ్దిదారులకు నిర్దేశిత బస్సులలో ఉచిత ప్రయాణం అనుమతిస్తామని చెప్పారు. వేళల జాతరకు మంచిర్యాల నుంచి పెద్దలకు రూ. 80, పిల్లలకు రూ. 50లు శ్రీరాంపూర్ నుంచి పెద్దలకు రూ. 70 లు , పిల్లలకు రూ. 40 లు చొప్పున టికెట్ రుసుము ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం చరవాణి 9959226004, 832-802-1517 లో సంప్రదించాలని ఆయన సూచించారు.