వాంకిడి : వాంకిడి మండలానికి చెందిన ఇద్దరికీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సమాజ్ రత్న అవార్డు (Samaj Ratna awards ) వరించింది. బీఎస్ఐ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కార్ ( Ashok Mahulkar ) , ఎన్ఎస్డీ జిల్లా ఇన్చార్జి సందీప్‌కు ( Sandeep ) అవార్డులు దక్కాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన సంత్ గురు రవిదాస్ జయంతి( Guru Ravidas Jayanthi ) వేడుకల సందర్భంగా రాష్ట్ర అవార్డులను అందుకున్నారు.
జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ అంబేద్కర్, సాహిత్య , సంస్కృతి సంవర్ధన్ మహమండల్, మౌలిక అధికార సమాజ్ సేవ మండలి ఆధ్వర్యంలో అఖిల భారతీయ సాహిత్య అకాడమీ అధ్యక్షులు ప్రశాంత్ జి. వంజారే, తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) , సంత్ రావిదాస్ సేవ మండల్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రప్రకాష్ ఈ అవార్డులను అందచేశారు.
సమాజసేవ, దళిత సంఘాల చైతన్యం,అంబేద్కర్ సంఘం, రమాభాయి మహిళ మండలి, సిద్దార్థ యువజన సంఘం ద్వారా ప్రజలను చైతన్యం చేయడంతో పాటు బుద్దుని బోధనలు, అంబేద్కర్ ఆలోచనాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు అవార్డు ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షులు మధు బావాల్కర్, అఖిల భారతీయ సమతా పరిషత్ అధ్యక్షులు చంద్రప్రకాష్ ,ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షులు మనోజ్ ఛాపాని , మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెట్లులే సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.