భీంపూర్, జనవరి17: పీహెచ్‌సీలు, రిమ్స్‌లో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని, ప్రజలు ఉపయోగించుకోవాలని మాతాశిశు సంరక్షణ జిల్లా అధికారి విజయసారథి అన్నారు. భీంపూర్ పీహెచ్సీలో మంగళవారం వైద్యులతో కలిసి 30 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. పౌష్టికాహార కిట్లు అందజేశారు. తరువాత ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
గర్భిణులు పీహెచ్సీలో ఉచిత వైద్య సేవలు పొందాలన్నారు. పీహెచ్సీ , రిమ్స్‌లో పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ప్రసవాలు చేస్తున్నట్లు వివరించారు. సర్కారు నగదు ప్రోత్సాహకంతో పాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ నిఖిల్రాజ్, డాక్టర్ విజయలక్ష్మి, హెచ్‌ఈవో జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్ , లూసీ, విష్ణు,శ్రీదేవి, పూర్ణిమ , ప్రవీణ్, దివ్య, వివేక్, అశోక్‌రెడ్డి, శ్రీదేవి, భాగ్యవతి, గోదావరి, రేఖ, శంకర్.శివాజీ, అశోక్ ఉన్నారు.