జై నూర్ : శ్రీ శ్రీ సద్గురు పులాజీ బాబా(Sadguru Phulaji Baba) జన్మదిన మహోత్సవ పోస్టర్లను గురువారం మండల కేంద్రంలో సంస్థాన అధ్యక్షులు కేశవ్ ఇంగ్లే విడుదల (Posters Release ) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్నాపూర్లోని సిద్దేశ్వర సంస్థాన్ మఠంలో ఈనెల 30న నిర్వహించే జన్మదిన వేడుకలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ , వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మనుషులకు మానవత్వాన్ని నేర్పించిన మహావ్యక్తి శ్రీ సద్గురు ఫులాజీ బాబా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి సుభాష్ దుక్రే, నాయకులు ఆత్రం రాము, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ , సహకార సంఘం చైర్మన్ కోడప హన్ను పటేల్, మేశ్రం అంబాజీరావు , దౌలత్రావు, తదితరులు పాల్గొన్నారు.