సినీ ఫక్కీలో దొంగల షి‘కారు’
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలోని రెండు కారు షోరూముల్లో ఒకే రోజు రెండు గంటల వ్యవధిలో దొంగతనం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో ఉన్న కారు షోరూంలో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో చోరీ చేశారు
- ఒకేరోజు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో ఘటన
- కారు షోరూముల్లోకి చొరబడి సొమ్ముతో ఉడాయింపు
- వాచ్‌మన్‌కు పిస్టల్ చూపించి బంధించిన అగంతకులు
- ఆదిలాబాద్‌లో రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
ఎదులాపురం/సోన్, సెప్టెంబర్ 21: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలోని రెండు కారు షోరూముల్లో ఒకే రోజు రెండు గంటల వ్యవధిలో దొంగతనం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో ఉన్న కారు షోరూంలో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో చోరీ చేశారు. రూరల్ సీఐ రఘుపతి, వాచ్‌మన్ ఆరిపెల్లి భూమన్న తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కారుషోరూంలోకి ముఖానికి మాస్కులు వేసుకున్న నలుగురు ఆగంతకులు చొరబడ్డారు. వారు అక్కడ పడుకొని ఉన్న వాచ్‌మన్ ఆరిపెల్లి భూమన్నకు పిస్తోల్ చూపించి భయపెట్టారు. బాత్రూంలోకి తీసుకెళ్లి గడియపెట్టారు. తర్వాత ఈ షోరూం షటర్ లేపి బీరువాలో ఉన్న రూ.3 లక్షల నగదుతో ఉడాయించారు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కారుషోరూం మేనేజర్ పోలీసులకు సమాచారమివ్వడంతో క్లూస్ టీం నేరం జరిగిన ప్రదేశంలో పరిశీలన చేసింది. వేలిముద్రలు సేకరించింది. మేనేజర్ ఫిర్యాదు మేరకు మావల ఎస్ఐ విష్ణువర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
నిర్మల్‌లోని హుండాయ్ షోరూంలో..
నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో ఎన్‌హెచ్ 44 పక్కన ఉన్న హుండాయ్ కారు షోరూంలోనూ దొంగలు చొరబడినట్లు నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. కారు షోరూంలోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చొరబడి మొదట సెక్యురిటీగార్డును కొట్టి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కొని లోపలికి చొరబడ్డారు. షోరూంలో వస్తువులేమీ లభించకపోవడంతో వెళ్లిపోయారు. సంఘటనా స్థలాన్ని నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి పరిశీలించి డాగ్‌స్కాడ్‌తో పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం : ఆర్డీవో చంద్రకళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

