ఆదిలాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. మంగళవారం రాత్రి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి లారీలో 110 క్వింటాళ్ల రేష న్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారు లు, పోలీసులు పట్టుకున్నారు. 356 రేష న్ దుకాణాల పరిధిలో 1,91,772 తెల్లరేషన్ కార్డులు ఉండగా.. ప్రభుత్వం ప్రతినెలా కుటుంబంలో ఒక్కొక్కరి ఆరు కిలో ల చొప్పున 4,069.252 మెట్రిక్ టన్ను ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. ప్రతినెలా మొదటివారంలో ప్రారంభమైన బియ్యం పంపిణీ 15 తేదీ వరకు కొనసాగుతున్నది. రక్తహీనతను నివారించడానికి ఫ్లోరిఫైడ్ రైస్‌ను కూడా పంపిణీ చేస్తున్నది. దుకాణాల్లో తీసుకున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు కొంత వాడుకుని మిగితా వాటిని విక్రయిస్తున్నారు. కొంద రు ఏ మాత్రం వినియోగించకుండా పూర్తిగా అమ్ముకుంటున్నారు. ఫ్లోరిఫైడ్ బియ్యం వాడకం విషయంలో అధికారు లు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా ఫలితం ఉండడం లేదు.
దందా ఇలా..
రేషన్ బియ్యం అక్రమ దందాలో భాగం గా వ్యాపారులు, దళారుల సూచనల మే రకు కొందరు పట్టణాలు, గ్రామాల్లో ఆ టోల్‌లో తిరుగుతూ కొనుగోలు చేస్తున్నా రు. ఇంటింటికీ వెళ్లి కిలోకు రూ.18 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు వీరు గ్రామాలకు వచ్చి రేషన్ బియ్యం సేకరిస్తారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని వ్యాపారులు, ద ళారులకు కిలోకు రూ.20 విక్రయిస్తారు. ఇలా ఇంటింటా తిరిగి సేకరించిన బి య్యాన్ని వ్యాపారులు నిల్వ చేసుకుని వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. మహారాష్ట్రంలో బియ్యం కిలోకు కనీసం రూ.24కు విక్రయిస్తారు. ప్రతినెలా వందల క్వింటాళ్లలో పక్కదారి పడుతుండగా రేషన్ దందా దళారులకు లాభసాటి గా మారింది. అధికారులు అక్రమ దందా కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.