సీసీసీ నస్పూర్, డిసెంబర్ 8 : కాంగ్రెస్ సర్కా రు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి ఈ ప్రాంత ప్రజలను అవమానపరుస్తున్నదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం నస్పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుతో పాటు పలువురు నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సా ధించారని, ఈ క్రమంలో రాష్ట్రమంతటా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ విగ్రహ రూపాన్ని మార్చడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై యా వత్ తెలంగాణ ప్రజానీకం మండిపడుతున్నదన్నారు. అభివృద్ధి సంక్షేమం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం అక్రమ అరెస్టులు, కేసులు ఇలా అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు, నిర్బంధాలతో పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్‌కుమార్, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, కుర్మిళ్ల అన్నపూర్ణ, నాయకులు బండి రమేశ్, మల్లెత్తుల రాజేంద్రపాణి, గుంట జగ్గయ్య, గుమ్మడి శ్రీను, రఫీక్‌ఖాన్, బండారి తిరుపతి, ఆకునూరి సంపత్‌కుమార్, గర్శె భీమయ్య, ఆకుల సతీశ్, అండ్లకొండ రవిగౌడ్, మాడుగుల స్వామిదాస్, పెరుమాళ్ల జనార్దన్, ధర్ని శంకర్, కొయ్యల రమేశ్, కాటం రాజు, సాజిద్, తిరుమల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.