Bank Accounts | విద్యార్థుల బ్యాంకు ఖాతాల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలి
Bank Accounts | విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు సకాలంలో వారి ఖాతాల్లో జమా అయ్యేలా బ్యాంకు ఖాతాల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్ గోపాల్ బ్యాంకర్లకు సూచించారు.
ఖానాపూర్: విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు సకాలంలో వారి ఖాతాల్లో జమా అయ్యేలా బ్యాంకు ఖాతాల ( Bank Accounts ) ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్ గోపాల్ (DM Ram Gopal ) బ్యాంకర్లకు సూచించారు.
2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఖానాపూర్ ఉమ్మడి మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం శుక్రవారం ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రైతు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానం, వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెస్ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం, ముద్రా, ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాల అమలు, వాటికి సంబంధించిన సాంకేతిక మద్దతు విధానాలను బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులకు వివరించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుమారు 2 వేల కొత్త బ్యాంకు ఖాతాలను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులు, బ్యాంకు మేనేజర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

