కుల వృత్తులకు పూర్వ వైభవం : ఎమ్మెల్యే జోగు రామన్న
ఎమ్మెల్యే జోగు రామన్న | కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.

ఆదిలాబాద్ : కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇందులో భాగంగానే మత్సకారుల ఆర్థిక బలోపేతానికి 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులో సోమవారం అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునేలా 100 శాతం సబ్సిడీపై అందిస్తున్న చేప పిల్లలు వృద్ధిచెంది వాటి విక్రయాలతో ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 92 కోట్ల చేపపిల్లలను సబ్సిడీపై అందించామని తెలిపారు. ఇందులో భాగంగానే సాత్నాల ప్రాజెక్టులో 2 లక్షల 60 వేల చేప పిల్లలు, లక్ష రొయ్య పిల్లలను వదిలినట్లు తెలిపారు.
అదేవిధంగా సాత్నాలలో ఫిష్ సీడ్ ఉత్పత్తి కేంద్రం సైతం ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారుల కోసం టు వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను అందించామన్నారు. మత్స్యకారుల కోసం ఫిష్ మార్కెటింగ్ యూనిట్ బోథ్ మండల్ కజ్జర్ల లో ఏర్పాటు చేశామని, ఇంకా రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్ కూడా మంజూరు చేశామన్నారు. త్వరలో మత్స్యకారులకు మార్కెటింగ్ కోసం మ్యాథ్స్ టాటా ఏసీ వాహనాలు కూడా అందిస్తామన్నారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నటరాజన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, జైనథ్ ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, మండల రైతు సమితి అధ్యక్షులు లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, చంద్రయ్య, దేవన్న, అధికారులు, మత్స్యకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

