మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 11: జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శనిత్రయోదశి సందర్భం గా మంచిర్యాల పట్టణంలోని మార్కెట్లో ప్ర మిదలను, లక్షీ పూజ సామగ్రిని శనివారం కొనుగోలు చేశారు. అదే విధంగా బాణసం చా దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది.
ఈ ఏడాది పండుగ రెండు రోజులు రావడంతో ఆదివారం దీపావళి, సోమవారం లక్ష్మీ పూజలు జరుపుకొని, కే దారీశ్వర స్వామి వ్రతాలు నోముకోనున్నా రు. ఆకట్టుకున్న ‘ప్రమిదలు’.. దీపావళి పండుగలో మట్టి ప్రమిదలకు ప్ర త్యేక స్థానం ఉంది. ఈ పండుగకు ఇంటిని దీపాలతో అలంకరించడం ఆనవాయితీ.
నోము ప్రత్యేకం.. పట్టణంలోని గుజరాతీలు ఈ పండుగను కాలచౌదష్గా నిర్వహిస్తారు. తెలంగాణలో కేదారీశ్వరి స్వామి వ్రతాన్ని జరుపుకుంటా రు. ఈ నోమును ఎంపికపునోము, రాశినో ము అని రెండు రకాలుగా నిర్వహిస్తారు. సంప్రదాయం ప్రకారం కొత్త అల్లుళ్లకు బ ట్టలు, కట్నకానుకలు పెడుతారు. పిండి వం టలు, అప్పాలను ప్రత్యేకంగా చేసుకొని దీ పావళి పండుగను జరుపుకుంటారు.