లక్షెట్టిపేట/జన్నారం, మార్చి 2 : లక్షెట్టిపేటరేంజ్ పరిధిలోని వెంకట్రావుపేట చెరువు వద్ద ఆదివారం బర్డ్‌వాక్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పక్షులు కిలకిల రావాలతో కనువిందు చేశాయి. పీసీసీఎఫ్ సువర్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఆమె మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు వలస పక్షులపై అధ్యయనం చేస్తున్నారని, విదేశాల నుంచి వివిధ రకాల పక్షులు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీపీటీ శాంతారాం, డీఎఫ్‌వో శివ్ఆశీష్ సింగ్, ఎఫ్ఆర్వో సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
జన్నారంలో..
జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కవ్వాల్ అడవుల్లో బైసన్‌కుంట వద్ద బర్డ్‌వాక్ ఫెస్ట్‌వల్ నిర్వహించారు. ఆదివారం ఉదయం ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కాలేజీకి చెందని విద్యార్థులు, పక్షి ప్రేమికులు పక్షులను వీక్షిస్తూ తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం వివిధ రకాల పక్షుల గురించి అధికారి అర్పిత విద్యార్థులకు అవగహన కల్పించినట్లు ఎఫ్ఆర్వో సుష్మారావు తెలిపారు. కాగా, జిల్లా కేంద్రంలో బర్డ్‌వాక్ ఫెస్ట్వెల్ ముగింపు సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులను డీఎఫ్‌వో శివ్ ఆశీష్సింగ్ అభినందించారు. ఆయా విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్, సతీశ్‌గౌడ్, కరస్పాండెంట్ ఏనుగు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.