బాలిక మృతి
భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి(14) అనే బాలిక శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట గల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
- వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని బంధువుల ఆరోపణ
- భైంసాలోని ప్రైవేట్ దవాఖాన ఎదుట ధర్నా
భైంసా, జూన్ 29 : భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి(14) అనే బాలిక శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట గల రోడ్డుపై ధర్నా నిర్వహించారు. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. కుభీర్ మండల కేంద్రానికి చెందిన శంకర్-విజయల కూతురు పల్లవి కడుపునొప్పితో బాధపడుతుండగా శుక్రవారం భైంసాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యుడు అపెండిక్స్ ఉందని ఆపరేషన్ చేసి తొలిగించాలని సూచించినట్లు పేర్కొన్నాడు.
దీంతో సాయంత్రం 6 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లగా దాదాపు మూడు గంటలపాటు ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో ఈ విషయమై వైద్యుడిని అడిగితే చిన్న పేగుకు చీము వచ్చిందని బీపీ తగ్గిపోయి సెప్టిక్ షాక్‌తో మృతి చెందిందని చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. వైద్యుడి వివరణతో సంతృప్తి చెందని బాలిక బంధవులు ఆందోళనకు దిగారు.
ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రాజారెడ్డి అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలిస్తామని చెప్పగా బాలిక బంధువులు ససేమిరా అన్నారు. స్థానిక వైద్యులపై తమకు నమ్మకం లేదని నిర్మల్‌కు తరలించాలని చెప్పడంతో వెంటనే నిర్మల్ ఆసుపత్రికి తరలించగా ఆందోళన విరమించారు. బాలిక తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

