కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి ( Kotapalli ) మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ( Heavy rain ) ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉంచిన వరి ధాన్యం తడిసి పోయింది. కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతుండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెద్దఎత్తున పేరుకుపోతున్నాయి. అకాల వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లే తమ పంట వర్షానికి తడిసిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేశారు.