భట్టి బడ్జెట్‌పై పెదవి విరుపు
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి పైసా కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం అంకెల గారడీ తప్ప.. పథకాలకు ఇచ్చిందేమీ లేదు. ఇదేం బడ్జెట్ అంటూ జనాలు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయానికి రూ. 72 వేల కోట్లు అంటూ గొప్పగా ప్రకటించినా.. రైతుబంధు, రైతు భరోసా పథకాలేవీ బడ్జెట్లో రాలేదు.
- నిరాశ పరిచిన కాంగ్రెస్ పద్దు..
- జిల్లాకు నిధుల కేటాయింపుపై రిక్త‘హస్తం’
- వరద విపత్తు నివారణకు ప్రత్యేక నిధులేవీ?
- చెన్నూర్, పడ్తనపల్లి లిఫ్ట్‌లు పక్కన పడినట్లే..
- ఆగిపోయిన అభివద్ధి పనుల కొనసాగింపుపై నో క్లారిటీ
- రైతుబంధు, రైతు భరోసాపై స్పష్టత కరువు
- పథకాలపై ప్రకటనలు, నిధుల కేటాయింపులు చేయలేదు
- ఇదేం బడ్జెట్ అంటూ పెదవి విరుస్తున్న ప్రజలు
మంచిర్యాల, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి పైసా కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం అంకెల గారడీ తప్ప.. పథకాలకు ఇచ్చిందేమీ లేదు. ఇదేం బడ్జెట్ అంటూ జనాలు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయానికి రూ. 72 వేల కోట్లు అంటూ గొప్పగా ప్రకటించినా.. రైతుబంధు, రైతు భరోసా పథకాలేవీ బడ్జెట్లో రాలేదు. పైగా గత ప్రభుత్వం రైతుబంధు పథకంతో రైతులకు డబ్బులిచ్చి దుబారా చేసిందంటూ ఆర్థిక మంత్రి మాట్లాడడంతో రైతులు మండిపడుతున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బులు వృథా చేసినట్లా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి ప్రసంగంతో రైతు వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్ చెప్పకనే చెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి పనులను కొనసాగించేలా బడ్జెట్లలో కేటాయింపులు ఉంటాయని భావించారు. ఒకవేళ అవి చేయలేకపోతే కొత్త పథకాలైనా ఉంటాయనుకున్నారు. కానీ కొత్త పథకాలు లేకపోగా దళితబంధు, మత్స్యకారులకు, గొల్లకురుమలకు చేయూత అందించే అనేక పథకాలకు సర్కారు మంగళం పాడింది.
lగోదావరి పరివాహక ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాలు, వ్యవసాయ భూములు ప్రతి వర్షాకాలం మునిగిపోతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారం చూ పించేందుకు నిధులు ఉంటాయని అంతా భావించారు. మంచిర్యాల పట్టణానికి సంబంధించి గోదావరికి కరకట్టలు కట్టేందుకు గత ప్రభుత్వం రూ.235 కోట్లతో ప్రతిపాదించిన నిధులకు ఈ బడ్జెట్లో మోక్షం కలుగుతుందనుకుంటే నిరాశే మిగిలింది.
lగోదావరి నది మీదుగా మంచిర్యాల- అంతర్గాం బ్రిడ్జి పనులకు కేసీఆర్ సర్కారు నిధులు ఇచ్చింది. శంకుస్థాపన జరిగి పనులు సైతం మొదలుపెట్టారు. కాంగ్రెస్ గెలిచాక ఆ పనులను అర్ధాంతరంగా ఆపేసింది. దాని స్థానంలో ముల్కల్ల నుంచి ముర్ముర్కు బ్రిడ్జి వేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కానీ, ఈ బడ్జెట్లో దానికి నిధులు ఇచ్చారా.. ఇవ్వలేదా అనేది తెలియదు. రోడ్లు, భవనాలకు ప్రతిపాదించిన బడ్జెట్ నుంచి వాటికి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంది. దీంతో మంజూరైన బ్రిడ్జిని ఆపేసి, కొత్త బ్రిడ్జి అని చెప్పి నిధులపై స్పష్టత ఇవ్వకపోవడంతో జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయిందని మండిపడుతున్నారు.
రైతులకు మేలు చేసే బడ్జెట్ కానేకాదు
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రైతాంగానికి ఏ మాత్రం మేలు చేసేది కానే కాదు. రైతుబంధు, రైతు భరోసాకు నిధులివ్వలేదు. దళితబంధు, మత్స్యకారులు- గొల్లకురుమల సంక్షేమం ప్రస్తావనే లేదు. ముఖ్యంగా కొత్త పథకాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. యేటా వర్షాకాలంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాలతో పాటు పంటలు నీటమునుగుతాయి. మంచిర్యాలలో గోదావరికి కరకట్ట నిర్మాణానికి నిధులేవీ కేటాయించలేదు. పడ్తనపల్లి లిఫ్ట్‌ను అసలు పరిగణలోకి తీసుకున్నట్లు లేదు. కేవలం కేసీఆర్ సర్కారును విమర్శించడానికే బడ్జెట్ పెట్టినట్లు అనిపించింది. పదేళ్లలో అన్ని రంగాల్లో పురోగతి సాధించిన గత ప్రభుత్వాన్ని తిట్టడం, చిన్నది చేసి మాట్లాడేందుకు బడ్జెట్ పెట్టినట్లు అనిపించింది. నిర్మాణాత్మక ప్రగతి సాధించే దిశగా ప్లాన్ చేసిన బడ్జెట్ కాదు. దీంతో జనాలకు చేకూరే ప్రయోజనం శూన్యం.
– నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల
బడ్జెట్ నిరాశపరిచింది
బడ్జెట్ నిరాశపరిచింది. రైతుబంధు, రైతు భరోసాకు నిధులు ఇవ్వలేదు. మహిళా సాధికారిత, పింఛన్లపై స్పష్టత ఇవ్వలేదు. ఆరు గ్యారంటీలు ఇచ్చారు. వాటిలో ఇప్పుడు అమలవుతున్న వాటినే ప్రస్తావించారు తప్పితే కొత్త గ్యారంటీల గురించి ప్రకటనే లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు.. వ్యవహరిస్తున్న తీరుకు అసలు సంబంధమే లేదు. వ్యవసాయానికి రూ.72 వేల కోట్లు ఇచ్చారు కానీ వాటిని వేటీ మీద ఖర్చు పెడతారన్నదానిపై స్పష్టత లేదు.
– అర్నె సమ్మయ్య, రైతు, శివ్వారం
బీఆర్ఎస్ సర్కారు హయాంలో శంకుస్థాపన చేసుకున్న చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్, పడ్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను అసలు పట్టించుకోనే లేదు. తలాపున గోదావరి ఉన్నా చుక్క నీరు కూడా వాడుకునే పరిస్థితి లేదనే మంచిర్యాల జిల్లా వాసుల బాధను పరిగణలోకి తీసుకొని మంచిర్యాలతో పాటు చెన్నూర్ నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు వీటికి శంకుస్థాపనలు చేసింది. బడ్జెట్ వీటి ప్రస్తావన లేకపోవడంతో జిల్లాకు సాగు నీరు అందించే ప్రాజెక్టులను సర్కారు పక్కన పెట్టేసినట్లు అయ్యింది.
జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ, బెల్లంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, ఐటీ హబ్, సింగరేణి కార్మికుల సంక్షేమం.. ఇలాంటి అంశాలను బడ్జెట్లో పరిగణలోకే తీసుకోలేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి మధ్యలో ఉన్న అభివద్ధి పనులకు నిధులొస్తాయనుకుంటే అది.. జరగనే లేదు. మొత్తానికి కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ అన్ని రంగాలకు నిరాశ మిగిల్చింది.
నిధుల సాధనపై నాయకులు గురి పెట్టాలి..
ఆశించిన జిల్లాకు ప్రత్యేక కేటాయింపులేమీ లేకపోయినా.. సంక్షేమానికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివద్ధికి, రోడ్లు భవనాల శాఖకు, ఇరిగేషన్ శాఖలకు కేటాయించిన నిధుల నుంచి అత్యధిక నిధులు జిల్లాకు తీసుకురావడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో.. 4 కాంగ్రెస్ గెలిస్తే అందులో మూడు స్థానాలు మంచిర్యాల జిల్లాలోనే ఉన్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలకు సీనియర్ లీడర్లుగా, కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వారిగా గుర్తింపు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యేలు పోటీ పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఎమ్మెల్యేలు జనాలను సంతృప్తి పరుస్తారా.. లేదా అన్నది వేచివేచి చూడాలి.
జిల్లాకు నిరాశే..
- ఏ ఒక్క అభివృద్ధికీ నిధులు కేటాయించని కాంగ్రెస్ సర్కారు
- సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వివక్షకు నిదర్శనమంటున్న ప్రజాప్రతినిధులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అనేక వాగ్ధానాలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాపై వివక్ష చూపిస్తున్నారు. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ ఒక్క అభివృద్ధి పనికీ నిధులు కేటాయించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని గిరిజనులు, ప్రజలు అభి ప్రాయపడుతున్నారు. 40కి పైగా వాగులపై వంతెనలు, వార్ధాపై బ్రిడ్జి, దాదాపు 140కి పైగా గ్రామాలకు రోడ్లు నిర్మించడంతో పాటు కుమ్రం భీం ప్రాజెక్టు కట్టకు మరమ్మతులు.. ఇలా అనేక అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశ కలిగించడంపై విమర్శలువిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
#బడ్జెట్లో జిల్లాకు అన్యాయం
అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో జిల్లాకు అన్యాయం చేసింది. ఏ ఒక్క సమస్య పరిష్కారానికి కూడా కూడా నిధులు కేటాయించలేదు. కనీసం కుమ్రం భీం ప్రాజెక్టు మరమ్మతుల కోసమైనా నిధులిస్తుందనుకున్నాం. ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను ఎందుకు కేటాయించలేదో చెప్పాలి.
– కోవ లక్ష్మి, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్
పట్టించుకోకపోవడం దారుణం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జ్జెట్‌లో కావాలనే ఆదివాసీ జిల్లాకు అన్యాయం చేశారు. అనేక గిరిజన గ్రామాలకు రోడ్లులేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులపై వంతెనలు లేక ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని వాటిని దాటుతున్నారు. జిల్లా అభివృద్ధి, సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణం.
– కనక యాదవ్రావ్, ఆదివాసీ జిల్లా నాయకుడు
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

