తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం .. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

కుభీర్ : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామునాయక్ తండా, దావూజీనాయక్ తండాలలో గిరిజన మహిళలు సంప్రదాయంగా జరుపుకునే ‘మేరా’ వేడుకల్లో జడ్పీటీసీ సభ్యురాలు అల్కాతాయి చౌహాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విభిన్న జాతులు, మతాలు, కులాలు, భాషలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఆయా ప్రాంతాలలో వారి వారి జీవన విధానాలను అనుసరించి పండుగలు చేసుకోవడం తెలంగాణకే ప్రత్యేకమని పేర్కొన్నారు. అనంతరం దావూజీ నాయక్ తండాలో సర్పంచ్ శంకర్ జాదవ్, ఎంపీటీసీ మల్లుకా రాథోడ్‌లతో కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
పార్డి(బీ)లో రూ.10లక్షలు, రామునాయక్ తండాలో రూ.6లక్షలు, పల్సిలో రూ.20లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసిఅభివృద్ది పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల సత్వర అభివృద్దికి పెద్దపీట వేస్తోందని అన్నారు. సర్పంచులు ఇందులో కీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని అన్నారు. జీపీ నిధులను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఎంపీపీ తూం లక్ష్మి, ఎంపీడీవో రమేశ్, ఎస్సై గంగారాం, సర్పంచులు తూం పుష్పలత, శంకర్ జాదవ్, శ్రీరాముల కవిత రాజేశ్, ఎంపీటీసీ మల్లుకా రాథోడ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, పార్టీ మండల కన్వీనర్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కందుర్ సంతోష్, ఎస్సీ సెల్ కన్వీనర్ గాడేకర్ రమేశ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ దొంతుల రాములు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

