Kubeer | సాంగ్వి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యారాలి కేటాయింపు
సాంగ్వి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యారాలిని కేటాయించారు.
కుభీర్, ఆగస్టు 07: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సాంగ్విలో బుధవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 55 మంది విద్యార్థులకు ఒక్కరే టీచరు ఉండడంతో విద్యార్థుల చదువులు ఎలా కొనసాగుతాయని వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మండల విద్యాధికారి సాంగ్వి గ్రామానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు అడిషనల్ టీచర్ ని పంపుతానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం మెటర్నరీ లీవ్‌లో ఉన్న టీచర్ స్థానంలో మరో ఉపాధ్యాయురాలిని అలాట్ చేశారు. గురువారం సాంగ్విలోని పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు టీచర్ ని పరిచయం చేశారు. తాత్కాలికంగా సమస్యను పరిష్కరించిన మండల విద్యాధికారి విజయకుమార్‌ను గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. మరో ఇద్దరు గ్రామానికి చెందిన విద్యావంతులను వాలంటీర్లుగా గ్రామస్తులే సమకూర్చుకున్నారు. మరో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను సాంగ్వి ప్రాథమిక పాఠశాలకు పోస్టింగులు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఎంఈవో గ్రామస్తులకు తెలిపారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

