100 శాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలి
జడ్పీ సీఈవో సుధీర్‌బాబు

దస్తురాబాద్ : గ్రామాల్లో వందశాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలని జడ్పీ సీఈవో సుధీర్‌బాబు సూచించారు. కొవిడ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహిస్తుందని ఆయన వివరించారు. మండలంలోని బుట్టాపూర్, మున్యాల, రాంపూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ క్యాంపులను ఆదివారం ఎంపీడీవో క్రాంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఏ గ్రామాల్లో టీకాల లక్ష్యాలను, ఎంతమందికి టీకాలు ఇస్తున్నారని అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ టీకాపై భయందోళనకు గురికాకుండా తప్పనిసరిగా కొవిడ్ టీకాలను వేసుకోవాలని గ్రామస్తులను కోరారు .
ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో అనిల్ కుమార్, సర్పంచ్ దుర్గం శంకర్, ఆర్ఐ గంగన్న, ఏపీయం గంగాధర్, హెచ్‌ఈవో వేణు గోపాల్, వీఆర్వో విశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు సంతపూరి శ్రీనివాస్, దుర్గం రాజలింగం, బాదం లక్ష్మీరాజం , వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కర్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

