నార్నూర్, జూలై 28 : నాందేవ్ కాంబ్లే సేవలు చిరస్మరణీయమని అన్న బావు సాఠే అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్ మోరే అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో మాజీ డిసిసిబి చైర్మన్ నాందేవ్ కాంబ్లే ఐదవ వర్ధంతి నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాందేవ్ కాంబ్లే రాజకీయంతో పాటు సమాజంలో అందించిన సేవలను కొనియాడారు. బీఆర్ఎస్ హయాంలో డిసిసిబి చైర్మన్గా అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉద్దవ్ కాంబ్లే, ప్రధాన కార్యదర్శి మధుకర్ కాంబ్లే, నాయకులు నాందేవ్, బాలాజీ, మధుకర్, వామన్ తదితరులున్నారు.