జగిత్యాల : మున్సిపల్ ఎన్నికలను ( Municipal elections ) పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు ( Sudama Rao) నోడల్ ఆఫీసర్లు , స్పెషల్ ఆఫీసర్లకు సూచించారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ , ఎన్నికల వ్యయ పరిశీలకుడు డి. శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్చాయుత , పారదర్శకంగా జరిగే విధంగా అందరు కలిసి పనిచేయాలని సూచించారు.
ఎన్నికలకు కేటాయించిన అధికారులందరు నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు ముఖ్యమైన అంశమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, ఎన్నికల్లో పోటీచేయు అభ్యర్థులు అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి , జిల్లా నోడల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.