వీగిపోయిన అవిశ్వాసం
మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్‌పై అసమ్మతి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ మీటింగ్ హాల్లో ప్రిసైడింగ్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో అవిశ్వాస సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశానికి 20 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.
బెల్లంపల్లి, జనవరి 12 : మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్‌పై అసమ్మతి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ మీటింగ్ హాల్లో ప్రిసైడింగ్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో అవిశ్వాస సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశానికి 20 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.
అవిశ్వాసానికి 22 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా హాజరైన కౌన్సిలర్లు తమకు కొంత సమయం కావాలని కోరడంతో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాన్ని వాయిదా వేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో 20 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండడంతో ప్రిసైడింగ్ అధికారి కోరం లేక అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకుమున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం కూడా కోరం లేక వీగిపోయింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ యథావిధిగా పదవుల్లో కొనసాగనున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

