ఆసిఫాబాద్ అంబేదర్చౌక్/రెబ్బెన, జనవరి 1: జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ దాసరి వేణు మర్యాదపూర్వకంగా కలిసి విషేస్ చెప్పారు.
రెబ్బెన మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆమెకు మిఠాయిలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోమ్మినేని అహల్యాదేవి, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ పర్లపల్లి వనజ, మాజీ వైస్ చైర్పర్సన్ కుందారపు శంకరమ్మ, బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, నాయకులు దుర్గం భరద్వాజ్, అన్నపూర్ణ మురళీగౌడ్ ఉన్నారు.