నాగోబా మహాపూజ.. బురుకుమ్గూడలో బస
నాగోబా మహాపూజ (జనవరి 21న)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మహా పాదయాత్ర మంగళవారం నార్నూర్ మండలం గుండాల గ్రామానికి చేరుకున్నది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులకు గ్రామస్తులు ఆహ్వానం పలికారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా గంగాజలం సేకరించే ఝరికి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు
- సోమవారం ఉదయం నర్సాపూర్ నుంచి గుండాల చేరుకున్న మెస్రం వంశీయులు
- ఆహ్వానం పలికిన గ్రామస్తులు
- మహిళలు, పురుషులు వేర్వేరుగా ఝరికి పూజలు
నార్నూర్/ఉట్నూర్ రూరల్, జనవరి 3 : నాగోబా మహాపూజ (జనవరి 21న)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మహా పాదయాత్ర మంగళవారం నార్నూర్ మండలం గుండాల గ్రామానికి చేరుకున్నది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులకు గ్రామస్తులు ఆహ్వానం పలికారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా గంగాజలం సేకరించే ఝరికి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. కానుకలు సమర్పించారు. అంతకుముందు సోమవారం రాత్రి ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో బస చేశారు. మంగళవారం ఉదయం అల్పాహారం చేసి, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, సర్పంచ్ కళావతితో కలిసి మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా గుండాల చేరుకున్నారు. తర్వాత గుండాల గ్రామం నుంచి గాదిగూడ మండలం లోకారి(కే) పంచాయతీ పరిధిలోని బురుకుమ్గూడకు బయల్దేరారు. అక్కడ ఆ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సుంగపూర్, పర్సువాడ(కే)గ్రామాల్లో బేటింగ్ నిర్వహించారు.
అక్కడి నుంచి సాయంత్రం బురుకుమ్గూడకు చేరుకోగా, గ్రామస్తులు, మెస్రం వంశీయులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. అక్కడే రాత్రి బసచేయగా, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు మాట్లాడుతూ.. నర్సాపూర్ నుంచి నార్నూర్ మండలం గుండాల, పర్సవాడ గుండా గాదిగూడలోని లోకారి చేరుకున్నామన్నారు. ఇక్కడ బస చేస్తామని చెప్పారు. అక్కడి నుంచి బొడ్డిగూడ, గణేశ్‌పూర్, లేండిజాల మీదుగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం గుంనూర్ మీదుగా ఈ నెల 10వ తేదీన నిర్మల్ జిల్లా కడెం మండలం మల్లాపూర్ చేరుకోనున్నట్లు వివరించారు. అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం గంగాజలంతో తిరుగు ప్రయాణం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు కటోడ కోసు, ప్రర్దాంజీ దాదారావ్, కటోడ కోసేరావ్, హనుమంత్‌రావ్, తిరుపతి, మెస్రం వంశీయులతో పాటు గ్రామ పెద్దలు తుమ్రం మల్కుపటేల్, మెస్రం ఆనంద్‌రావ్, ఆత్రం భీంరావ్, ఆడా శ్రీరామ్, మాధవ్, యాదవ్రావ్, మాల్‌కు పాల్గొన్నారు.
కొనసాగుతున్న జాతర ఏర్పాట్లు..
ఇంద్రవెల్లి, జనవరి 3 : కెస్లాపూర్ నాగోబా జాతరను పురస్కరించుకోని అధికారులు జాతర ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆలయ పరిసరాలతోపాటు, గోవాడ్ ప్రాంతంలో భూమి చదును చేస్తున్నారు. బ్లేడ్ ట్రాక్టర్‌తో చెత్తతోపాటు పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. గోవాడ్‌కు రంగులు వేస్తున్నారు. మెండపల్లి రోడ్డుకు మోరం వేసి, చదును చేస్తున్నారు. కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్ దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఎప్పటికప్పుడు అధికారులకు పనులపై సూచిస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

