తాండూర్, మార్చి 26 : మండలంలోని పలు గ్రామాలతో పాటు మాదారం టౌన్ షిప్ శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, దీక్షధారణ, అంకురార్పణ, కలశ స్థాపన కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ముద్దు అవదూత శర్మ వైభవంగా జరిపించారు.
శ్రీరామనవమిని పునస్కరించుకొని గురువారం శ్రీ సీతారాముల ఎదుర్కోలు వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ద్వారకాపూర్లో రాములవారి కల్యాణం కోసం భద్రాచలం నుండి వచ్చిన గోటితో ఒలిచిన తలంబ్రాలు, ముత్యాలు, పట్టువస్త్రాలు ఆలయ కమిటీకి తాండూర్ మాజీ ఎంపీపీ మాసాడి శ్రీదేవి శ్రీరాములు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎల్లాకుల రవి, చెంద్రగిరి శ్రీనివాస్, సురేష్, లక్ష్మణ్, కన్నాల మాజీ సర్పంచ్ జిల్లపల్లి స్వరూప వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ దూగుట స్వప్న, పూజారి విష్ణు, ఆంజనేయ స్వాములు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.