సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోడు భూముల వివరాల నమోదు..
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి శివాని డోంగ్ర, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి రెవెన్యూ, అటవీశాఖల అధికారులు, సర్వేయర్లతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 106 ఆవాస ప్రాంతాలు ఉన్నాయని ప్రతీ ఆవాస ప్రాంతానికి ఒక అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలోని సర్వేయర్లందరికీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పై తగిన శిక్షణను అందిస్తున్నామని వివరించారు.
ఆర్వోఎఫ్ఆర్-2005 చట్టం ప్రకారం 2005 సంవత్సరం నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారి వద్ద వివరాలను స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రతి ఆవాస ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించి జీపీఎస్‌ను నమోదు చేస్తున్నామని, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ప్రభుత్వం సూచించిన జీపీఎఫ్ యాప్‌ను వినియోగించడం ద్వారా సమీప ప్రాంతాలను గుర్తించడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు ఉండగా 81 గ్రామ పంచాయతీలలో పోడు వ్యవసాయం సాగు కోసం భూ ఆక్రమణ జరిగిందన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వివరాలను సేకరించాలన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

