ప్రభుత్వ టీచర్‌తో సహా ముగ్గురు వ్యాపారులపై పీడీ చట్టం అమలు

మంచిర్యాల : ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సహా మరో ముగ్గురు వ్యాపారులపై పోలీసులు పీడీ చట్టం అమలు చేశారు. ఈ ఘటన మంచిర్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తుండటంతో అరెస్టు చేసి పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. నిందితులు బెల్లంపల్లిలోని ఇన్క్లేన్ బస్తీకి చెందిన వ్యాపారి పల్లిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూర్ మండలానికి చెందిన పూసా సుబ్బారావు, భేమిని మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భీమిని మండల కేంద్రానికి చెందిన ఎరువుల దుకాణ యజమాని చౌదరి దినేష్.
ప్రభాకర్, సుబ్బారావు, సురేష్ ఒక ముఠాగా ఏర్పడి చాలా కాలం నుండి ఈ దందాలు చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మూడు నేరాల్లో వీరు పాలుపంచుకున్నట్లు సమాచారం. ఏపీలోని కర్నూలులో గల గొల్లపుడి రోషయ్య అనే వ్యక్తి నుండి విత్తనాలను సేకరిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయించి రైతులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ ఈ సందర్భంగా హెచ్చరించారు. వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

