Mancherial | రాష్ట్రంలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ అవతరణ
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు

మంచిర్యాలటౌన్ : రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత బలమైన శక్తిగా అవతరించిందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వార్డు, గ్రామ కమిటీల జాబితాను టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి గూడూరి ప్రవీణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, క్రమశిక్షణతోనే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని అన్నారు. నియోజకవర్గంలోని 66 గ్రామాలు, 74 వార్డులలో ఇప్పటికే కమిటీల నియామకం పూర్తయిందని, పార్టీ కమిటీతోపాటు మహిళాకమిటీ, యూత్‌కమిటీ, మైనార్టీ కమిటీలను పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నామని పేర్కొన్నారు.
చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం శుభ పరిణామమని అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన సాగుతోందని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను జనరంజకంగా సాగిస్తున్నారని అన్నారు. నోటి దురుసు నాయకులు వారి ఉనికి కోసం నీచమైన మాటలు మాట్లాడుతూ ప్రజల్లో మరింత చులకనగా తయారవుతున్నారని అన్నారు. వారి మాటలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.
ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, ఎమ్మెల్యే తనయుడు విజిత్‌రావు, నాయకులు అత్తి సరోజ, గోగుల రవీందర్‌రెడ్డి, గాదెసత్యం, గొంగళ్ల శంకర్, తోట తిరుపతి, బొలిశెట్టి కిషన్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

