అట్టడుగువారి అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్

ఆదిలాబాద్ రూరల్ : అట్టడుగువారి అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎస్టీ లబ్ధిదారులకు రుణాల మంజూరు కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనేక పథకాల కింద రుణాలు అందిస్తుందన్నారు.
ఎస్టీలకు పట్టణంలో 60మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రుణాలకు ఎంపికైన లబ్ధిదారులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, బ్యాంకు ప్రతినిధులు, కౌన్సిలర్లు , మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

