వ్యవసాయబావిలో పడ్డ అడవి బర్రె.. కాపాడిన అటవీ అధికారులు

కొమురంభీం ఆసిఫాబాద్ : ప్రమాదవశాత్తు ఓ అడవి బర్రె వ్యవసాయబావిలో పడింది. ఈ ఘటన సిర్పూర్(టీ) అటవీ ప్రాంత పరిధిలోని కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దాన్ని రక్షించారు. సిర్పూర్(టీ) అటవీ రేంజ్ అధికారి సీహెచ్ పూర్ణచందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రెండేళ్ల మగ అడవి బర్రె ప్రమాదవశాత్తు రోడ్డుప్రక్కగా తక్కువ లోతులో ఉన్న వ్యవసాయబావిలో పడిపోయింది.
జేసీబీ సహాయంతో దాన్ని రక్షించి మహారాష్ట్రకు పంపించినట్లు తెలిపారు. ఆహారం వెతుక్కునే నిమిత్తం అడవి బర్రె పెన్గంగ నదిని దాటి ఉండొచ్చన్నారు. నాలుగు అడవి బర్రెలు ఇటీవల కాలంలో తెలంగాణలోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. సిర్పూర్(టీ) డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాకేశ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

